కలియుగం లో కనిపించిన దేవుడు సత్యసాయి వెళ్లి పోయారు. మనవ సేవే మాధవ సేవ అని చేసి చూపించి అసాద్యం అనుకునే దాన్ని సాద్యం చేసి మార్గం చూపి వెళ్లారు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ధనాన్ని ఇంధనముగా చేసి మనుషులంతా ఒక్కటే అని బీదవాని నుండి బిలియనీరు వరకు అందరిని మానవ సేవలో తరింపచేసి పునీతులను చేసారు. వారు భౌతికముగా లేనప్పటికీ మన మనస్సులో ఎప్పటికి ఉండి మనలో ప్రేమ తత్వాన్ని నిద్రలేపుతూ జీవించే ఉంటారు. పూర్తిగా మానవ రూపం దాల్చని కొందరు స్వామి లక్షల కోట్లు సంపాదించాడు అంటూ చేసిన విమర్శలు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాను. స్వామి కూడబెట్టిన సంపద అంతా ఇక్కడే మనకే వదలి వెళ్లారు తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంతకన్నా ఎక్కువ సంపద పరాయి దేశములో దాచిపెట్టిన కుంభకర్ణులను మాత్రం ఎవరు పట్టించుకోరు. హే భగవాన్ ఇప్పటికయినా సదరు మనుషులు కాని మనుషులు మారి స్వార్ధం వీడి ప్రేమను పెంచుకొని మానవ సేవకు మరలుతారని కోరుకుంటున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment