KOODALI

Tuesday, July 23, 2013

తీరికలేని జీవితం

మనసులో మెదులుతున్న భావాలు బ్లాగ్ లో పెడదామంటే సమయం అనుకూలించుట లేదు. ఈ పరుగుల జీవితం ఎప్పటికి నిలబడుతుందో తెలియటం లేదు. నిలబడి ఒక్క క్షణం చుట్టూ తిరిగి చూడాలని ఉంది. నిజంగా జీవితాన్ని ఆస్వాదించిన వారు మన పూర్వికులే. మనం జీవితాన్ని వదిలేసి వేటివేనుకో పరిగెడుతున్నామని అనిపిస్తుంది. ఫేస్ బుక్ వచ్చిన తరువాత ఏ కొంచెం సమయం దొరికినా అది తినేస్తుంది. ముందు ముందు ఏమాత్రం సమయం దొరికినా తప్పనిసరిగా ఇక్కడే ఖర్చు చేయాలని కోరుకుంటున్నాను.చివరిగా చిన్న జోక్

భార్యాభర్తలు బజారులో వెళుతుంటే ఒక షాప్ లో ఇలా బోర్డ్ పెట్టిఉంది "మాన్సూన్ ఆఫర్ కేవలం కొన్నిరోజులు మాత్రమే  బనారస్ చీర  రూ.12/-, సిల్క్ చీర   రూ.10/-, కాటన్ చీర  రూ.8/- త్వరపడండి". అదిచూసిన భార్య ఏమండి నాకు అర్జంటుగా రూ.500/- ఇవ్వండి  యాబై చీరలు కొంటాను అంది. భర్త షాప్ కేసి చూసి ఒసేయ్ పిచ్చి మొహమా అది ఇస్తీ షాపే అన్నాడు . ఇక ఉంటాను మరి   

Monday, March 12, 2012

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.
ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.
ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.
తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.
“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.
ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.

Sunday, April 24, 2011

Living God has passed away


కలియుగం లో కనిపించిన దేవుడు సత్యసాయి వెళ్లి పోయారు. మనవ సేవే మాధవ సేవ అని చేసి చూపించి అసాద్యం అనుకునే దాన్ని సాద్యం చేసి మార్గం చూపి వెళ్లారు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ధనాన్ని ఇంధనముగా చేసి మనుషులంతా ఒక్కటే అని బీదవాని నుండి బిలియనీరు వరకు అందరిని మానవ సేవలో తరింపచేసి పునీతులను చేసారు. వారు భౌతికముగా లేనప్పటికీ మన మనస్సులో ఎప్పటికి ఉండి మనలో ప్రేమ తత్వాన్ని నిద్రలేపుతూ జీవించే ఉంటారు. పూర్తిగా మానవ రూపం దాల్చని కొందరు స్వామి లక్షల కోట్లు సంపాదించాడు అంటూ చేసిన విమర్శలు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాను.  స్వామి కూడబెట్టిన సంపద అంతా ఇక్కడే మనకే వదలి వెళ్లారు తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంతకన్నా ఎక్కువ సంపద పరాయి దేశములో దాచిపెట్టిన కుంభకర్ణులను మాత్రం ఎవరు పట్టించుకోరు. హే భగవాన్ ఇప్పటికయినా సదరు మనుషులు కాని మనుషులు  మారి  స్వార్ధం వీడి ప్రేమను పెంచుకొని మానవ సేవకు మరలుతారని కోరుకుంటున్నాను.          


http://www.srisathyasai.org.in/

Wednesday, April 6, 2011

మేరా భారత్ మహాన్

మన భారత దేశం లో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు, జాతులు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి, ఏ ఒక్క దానికి మరొక దానితో పోసగదు. ప్రతిదానికి ఘర్షణ పడుతూ ఉంటాము. ఎన్నెన్నో రాజకీయాలు చేస్తూ అధికారము కొరకు తన్నుకుంటూ ఉంటారు. ఒక్క తల్లి కి పుట్టిన బిడ్డలు కూడా కలిసి మెలసి ఉండరు. కాని ఒక్కటే ఒక్కటి మాత్ర్హము మన భారతీయులందరిని ఏకం చేస్తుంది. అదే క్రికెట్.  ఈ ఆట విషయానికి వస్తే మేమందరం భారతీయులం, మేర భారత్ మహాన్ అంటూ ఇండియాని కీర్తిస్తూ గెలిచినప్పుడు సంతోషంతో, ఆనందముతో గెంతులు వేస్తాము. ఎవరు ఈ విషయములో విభేధించరు. అందరు కలిసి పండగ చేసుకునేది క్రికెట్ లో గెలిచినప్పుడే. దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఇది చూస్తే క్రికెట్ మన దేశభక్తికి చాల ఉపయోగపడుతుంది. ఇండియా ప్రపంచ కప్ గెలిచినప్పుడు ప్రతి వక్కరు తామే గెలిచినట్లు సంబరపడిపోయారు. ఆనందంతో చిందులు వేసి భాణాసంచా కాల్చి పండగ చేసుకున్నారు. దేశప్రజలు అందరు కలిసి చేసుకునే పండగ ఇదేనేమో.  థాంక్స్ తో టీం ఇండియా అండ్ క్రికెట్.       

Monday, July 26, 2010

telugu joke

పేషంట్ : డాక్టర్ గారు ప్రతిరోజూ నేను ముందుకు వంగి ఒక కాలు పైకి లేపి రెండు చేతులు మోకాళ్ళ దగ్గరనుంచి నడుము దాక తెస్తుంటే నడుము దగ్గర నొప్పి వస్తుంది, ఏమైనా మందులు ఇవ్వండి.
డాక్టర్ : హ హ అదేమీ పిచ్చిపని ఎందుకలా చేయటం? అలా చెయ్యటం మానేస్తే సరి.
పేషంట్ : మరి నేను ప్యాంటు వేసుకోనేదేలా?  


Friday, January 22, 2010

TELUGU JOKE


రమేష్ :అసలు మగవాళ్ళు, ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఈ  గొడవలు, విడాకులు అసలే ఉండవు
సురేష్: ఇంకాస్త తెలివిగా ఆలోచిస్తే అసలు పెళ్లిల్లె  ఉండవు

TELUGU JOKE

పిసినారి పాపారావు  జుయలరి షాప్ కి వెళ్లి ఈ నగ ఎంత? అని అడిగాడు, దానికి షాపతను ఇరవై వేలు అన్నాడు, పాపారావు వెంటనే బాబోయ్ అన్నాడు, మళ్లీ మరొక నగ చూసి ఇది ఎంత? అన్నాడు దానికి షాపతను "రెండు బాబోయ్ లు" అని జవాబు ఇచ్చాడు.