ప్రియ మిత్రులారా! నేడు మన నాగరిక జీవితం సంతోషంగా గడుపుతున్నామా , ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మన బాల్యం లో గడిపిన రోజులు తలుచుకుంటే ఆ రోజులు మరల తిరిగి వస్తాయా అనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి జీవితం ఎంతో సౌకర్యవంతముగా మారినా సౌఖ్యం పెరిగిందే తప్ప సుఖం తరిగిపోయింది. సెల్ ఫోన్ వచ్చి మనశాంతి లేకుండా చేసింది. సమయం సందర్భం లేకుండా కాల్స్, ఎదురుగా మనిషి ఉన్నా మాట్లాడకుండా వాడిని వేయిటింగ్ లో పెట్టి ఎక్కడో ఉన్న వాడితో మాట్లాడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్ లో మాటలే , టీవీ లు వచ్చి మనుషులందరూ ఇంట్లోనే ఉన్నాఒంటరి వాళ్ళను చేసింది. ఇరువై నాలుగు గంటలు ఎంతమాత్రం సరిపోవటం లేదు. కొంచెం కూడా విరామం లేకుండా గడుపుతూ మనకోసం మనం బ్రతకటం ఎప్పుడూ మర్చిపోయాము. నాకు బాగా గుర్తు, నా బాల్యంలో అనగా విద్యార్థి దశలో ఎన్ని పుస్తకాలు చదివానో , రాత్రి వేల ఆరుబయట మంచం వేసుకొని పడుకొని రేడీయోలో పాటలు వింటూ ఆకాశంలో చుక్కలు లేక్కపెట్టుకొన్న రోజులు ఎలా మరిచిపోగలను. ఎన్ని ఆటలు ఆడుకున్నానో , రోజుకి ఇరువై నాలుగు గంటలు చాల ఎక్కువ అనిపించేది, మరి ఇప్పుడు సరిపోవటం లేదు. ఇప్పుడు నా పిల్లలను చూస్తె జాలి వేస్తుంది. స్కూలు, స్కూలు నుంచి రాగానే హోమ్ వర్క్, టీవీ. ఒక ఆటా లేదు పాటా లేదు. చదువు, టీవీ , సెలవుల్లో సరదాగా గడుపుదామన్న ఎవరికీ తీరిక చిక్కటం లేదు. బందువుల రాక పోకలు లేవు, శుభకార్యాలకు తిని పోవటానికే వస్తున్నారు కాని ఎంతోకాలానికి కలిసాము కదా కొన్నిరోజులు ఉండి మనసులు విప్పి మాట్లాడుకుందాం అంటే ఎవరికీ టైం లేదు. అంత హర్రి బర్రి. పల్లెల్ల్లో విశాలమైన ఇళ్ళను వదలిపెట్టి పట్నాల్లో అగ్గిపెట్టెల వంటి ఇళ్ళల్లో కాపురాలు పెట్టి ఎందరము కలిసి ఉంటాము అసాధ్యం కదా! సంపాదనకు నిరంతరం అర్రులు చాస్తూ డబ్బే ప్రధానం అనుకొని ఎంత డబ్బు ఉంటె అంత గొప్ప అనుకొని నాగరిక జీవితమే జీవితం అనుకొని యంత్రాల్లా బ్రతుకుతున్నామే తప్ప మనుషుల్లా బ్రతకటం లేదు. చస్తే ఎడవటానికి కూడా ఎవరికీ తీరిక లేదు. చనిపోయిన తరువాత మనము సంపాదించినా డబ్బు మనతో రాదనీ తెలిసినా, మనకు తృప్తి లేదు. మనకి సరిపోను సంపద ఉన్నా ఎన్నో అక్రమాలకూ పాల్పడి పోటీలు పడి ఇంకా సంపాదిస్తూనే ఉన్నాము. కోట్ల రూపాయలు ఉన్నా మనం తినేది అందరిలాగే కాని ఎక్కువ తినలేము కదా. మన దగ్గర సంపద ఉన్నా కడు పేదరికము లో ఉన్నవారికి, అనారోగ్యం తో ఉన్నవారికి ఒక్క పైసా కూడా ఇవ్వము. పైగా వారంటే అసహ్యం. అసలు మనం మనుషులమేనా అనిపిస్తుంది. అదీ మన నాగరికత . ఇప్పటికి చాలు ఇంకా చాలా వ్రాయాల్సి ఉండి.
Showing posts with label CIVILIZED. Show all posts
Showing posts with label CIVILIZED. Show all posts
Tuesday, December 29, 2009
Subscribe to:
Posts (Atom)