KOODALI

Sunday, April 24, 2011

Living God has passed away


కలియుగం లో కనిపించిన దేవుడు సత్యసాయి వెళ్లి పోయారు. మనవ సేవే మాధవ సేవ అని చేసి చూపించి అసాద్యం అనుకునే దాన్ని సాద్యం చేసి మార్గం చూపి వెళ్లారు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ధనాన్ని ఇంధనముగా చేసి మనుషులంతా ఒక్కటే అని బీదవాని నుండి బిలియనీరు వరకు అందరిని మానవ సేవలో తరింపచేసి పునీతులను చేసారు. వారు భౌతికముగా లేనప్పటికీ మన మనస్సులో ఎప్పటికి ఉండి మనలో ప్రేమ తత్వాన్ని నిద్రలేపుతూ జీవించే ఉంటారు. పూర్తిగా మానవ రూపం దాల్చని కొందరు స్వామి లక్షల కోట్లు సంపాదించాడు అంటూ చేసిన విమర్శలు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాను.  స్వామి కూడబెట్టిన సంపద అంతా ఇక్కడే మనకే వదలి వెళ్లారు తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంతకన్నా ఎక్కువ సంపద పరాయి దేశములో దాచిపెట్టిన కుంభకర్ణులను మాత్రం ఎవరు పట్టించుకోరు. హే భగవాన్ ఇప్పటికయినా సదరు మనుషులు కాని మనుషులు  మారి  స్వార్ధం వీడి ప్రేమను పెంచుకొని మానవ సేవకు మరలుతారని కోరుకుంటున్నాను.          


http://www.srisathyasai.org.in/

Wednesday, April 6, 2011

మేరా భారత్ మహాన్

మన భారత దేశం లో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు, జాతులు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి, ఏ ఒక్క దానికి మరొక దానితో పోసగదు. ప్రతిదానికి ఘర్షణ పడుతూ ఉంటాము. ఎన్నెన్నో రాజకీయాలు చేస్తూ అధికారము కొరకు తన్నుకుంటూ ఉంటారు. ఒక్క తల్లి కి పుట్టిన బిడ్డలు కూడా కలిసి మెలసి ఉండరు. కాని ఒక్కటే ఒక్కటి మాత్ర్హము మన భారతీయులందరిని ఏకం చేస్తుంది. అదే క్రికెట్.  ఈ ఆట విషయానికి వస్తే మేమందరం భారతీయులం, మేర భారత్ మహాన్ అంటూ ఇండియాని కీర్తిస్తూ గెలిచినప్పుడు సంతోషంతో, ఆనందముతో గెంతులు వేస్తాము. ఎవరు ఈ విషయములో విభేధించరు. అందరు కలిసి పండగ చేసుకునేది క్రికెట్ లో గెలిచినప్పుడే. దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఇది చూస్తే క్రికెట్ మన దేశభక్తికి చాల ఉపయోగపడుతుంది. ఇండియా ప్రపంచ కప్ గెలిచినప్పుడు ప్రతి వక్కరు తామే గెలిచినట్లు సంబరపడిపోయారు. ఆనందంతో చిందులు వేసి భాణాసంచా కాల్చి పండగ చేసుకున్నారు. దేశప్రజలు అందరు కలిసి చేసుకునే పండగ ఇదేనేమో.  థాంక్స్ తో టీం ఇండియా అండ్ క్రికెట్.       

Monday, July 26, 2010

telugu joke

పేషంట్ : డాక్టర్ గారు ప్రతిరోజూ నేను ముందుకు వంగి ఒక కాలు పైకి లేపి రెండు చేతులు మోకాళ్ళ దగ్గరనుంచి నడుము దాక తెస్తుంటే నడుము దగ్గర నొప్పి వస్తుంది, ఏమైనా మందులు ఇవ్వండి.
డాక్టర్ : హ హ అదేమీ పిచ్చిపని ఎందుకలా చేయటం? అలా చెయ్యటం మానేస్తే సరి.
పేషంట్ : మరి నేను ప్యాంటు వేసుకోనేదేలా?  


Friday, January 22, 2010

TELUGU JOKE


రమేష్ :అసలు మగవాళ్ళు, ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఈ  గొడవలు, విడాకులు అసలే ఉండవు
సురేష్: ఇంకాస్త తెలివిగా ఆలోచిస్తే అసలు పెళ్లిల్లె  ఉండవు

TELUGU JOKE

పిసినారి పాపారావు  జుయలరి షాప్ కి వెళ్లి ఈ నగ ఎంత? అని అడిగాడు, దానికి షాపతను ఇరవై వేలు అన్నాడు, పాపారావు వెంటనే బాబోయ్ అన్నాడు, మళ్లీ మరొక నగ చూసి ఇది ఎంత? అన్నాడు దానికి షాపతను "రెండు బాబోయ్ లు" అని జవాబు ఇచ్చాడు. 

Tuesday, December 29, 2009

CIVILIZED LIFE, NAAGARIKA JEEVITHAM

ప్రియ మిత్రులారా! నేడు మన నాగరిక జీవితం సంతోషంగా గడుపుతున్నామా , ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మన బాల్యం లో గడిపిన రోజులు తలుచుకుంటే ఆ రోజులు మరల తిరిగి వస్తాయా అనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి జీవితం ఎంతో సౌకర్యవంతముగా మారినా సౌఖ్యం పెరిగిందే తప్ప సుఖం తరిగిపోయింది. సెల్ ఫోన్ వచ్చి మనశాంతి లేకుండా చేసింది. సమయం సందర్భం లేకుండా  కాల్స్, ఎదురుగా మనిషి ఉన్నా మాట్లాడకుండా వాడిని వేయిటింగ్ లో పెట్టి ఎక్కడో ఉన్న వాడితో మాట్లాడుతూ  విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్ లో మాటలే , టీవీ  లు వచ్చి మనుషులందరూ ఇంట్లోనే ఉన్నాఒంటరి వాళ్ళను చేసింది. ఇరువై నాలుగు గంటలు ఎంతమాత్రం సరిపోవటం లేదు. కొంచెం కూడా  విరామం లేకుండా గడుపుతూ మనకోసం మనం బ్రతకటం ఎప్పుడూ మర్చిపోయాము. నాకు బాగా గుర్తు, నా బాల్యంలో అనగా విద్యార్థి దశలో  ఎన్ని పుస్తకాలు చదివానో , రాత్రి  వేల ఆరుబయట మంచం వేసుకొని పడుకొని రేడీయోలో  పాటలు వింటూ  ఆకాశంలో చుక్కలు లేక్కపెట్టుకొన్న రోజులు ఎలా మరిచిపోగలను. ఎన్ని ఆటలు ఆడుకున్నానో ,  రోజుకి ఇరువై నాలుగు గంటలు చాల ఎక్కువ అనిపించేది, మరి ఇప్పుడు సరిపోవటం లేదు. ఇప్పుడు నా పిల్లలను చూస్తె జాలి వేస్తుంది. స్కూలు, స్కూలు నుంచి రాగానే  హోమ్ వర్క్,  టీవీ. ఒక ఆటా లేదు పాటా లేదు. చదువు, టీవీ , సెలవుల్లో   సరదాగా గడుపుదామన్న ఎవరికీ తీరిక చిక్కటం లేదు. బందువుల రాక పోకలు లేవు, శుభకార్యాలకు తిని పోవటానికే వస్తున్నారు కాని ఎంతోకాలానికి కలిసాము కదా కొన్నిరోజులు ఉండి మనసులు విప్పి మాట్లాడుకుందాం అంటే ఎవరికీ టైం లేదు. అంత హర్రి బర్రి. పల్లెల్ల్లో విశాలమైన ఇళ్ళను వదలిపెట్టి పట్నాల్లో  అగ్గిపెట్టెల వంటి ఇళ్ళల్లో  కాపురాలు పెట్టి ఎందరము కలిసి ఉంటాము అసాధ్యం కదా!  సంపాదనకు నిరంతరం అర్రులు చాస్తూ డబ్బే ప్రధానం అనుకొని  ఎంత డబ్బు ఉంటె అంత గొప్ప అనుకొని నాగరిక జీవితమే జీవితం అనుకొని యంత్రాల్లా బ్రతుకుతున్నామే తప్ప మనుషుల్లా బ్రతకటం లేదు. చస్తే ఎడవటానికి కూడా ఎవరికీ తీరిక లేదు. చనిపోయిన తరువాత మనము సంపాదించినా డబ్బు మనతో రాదనీ తెలిసినా, మనకు తృప్తి లేదు. మనకి సరిపోను సంపద ఉన్నా ఎన్నో అక్రమాలకూ పాల్పడి పోటీలు పడి ఇంకా సంపాదిస్తూనే ఉన్నాము. కోట్ల రూపాయలు   ఉన్నా మనం తినేది అందరిలాగే కాని ఎక్కువ తినలేము కదా. మన దగ్గర సంపద ఉన్నా కడు పేదరికము లో ఉన్నవారికి, అనారోగ్యం తో ఉన్నవారికి ఒక్క పైసా కూడా ఇవ్వము. పైగా వారంటే అసహ్యం.  అసలు మనం మనుషులమేనా అనిపిస్తుంది.  అదీ మన నాగరికత . ఇప్పటికి చాలు ఇంకా చాలా వ్రాయాల్సి ఉండి.

dammalapati

హలో దమ్మాలపాటి ఇంటి పేరు కల వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చెయ్యండి, మన మూలాలు తెలుసుకుందాం ప్లీజ్